బాబు జిమ్మిక్కులు పని చేయవు
కూటమికి ఇక పరాజయమే
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆయన పనై పోయిందన్నారు. శేష జీవితం గడపడమే ఉత్తమమన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ఇక మరో కూటమి నేత పవన్ కళ్యాణ్ ఉన్నా లేనట్టేనని అన్నారు.
ఆయనను లీడర్ గా ఎవరూ పరిగణించడం లేదన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వృద్దులకు మేలు చేకూర్చేలా ప్రతి నెలా నెలా పెన్షన్లను వాళ్ల ఇంటికే పంపించానని కానీ చంద్రబాబు కూటమి కావాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఆయనను ఎవరూ లీడర్ గా పరిగణించడం లేదన్నారు ఏపీ సీఎం.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇవాళ తాము ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను కేంద్రం సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని చంద్రబాబు కూటమికి హితవు పలికారు.