బాబూ ఏపీకి ఏం చేశావో చెప్పు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గ మాట్లాడితే మంచిదని సూచించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
త్వరలోనే ఇంటింటికీ తాగు నీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వచ్చిన టీడీపీ కూటమి నేతలు గతంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి. దాదాపు 200 కుటుంఆలకు పైగా వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజలు అభివృద్దిని కోరుకుంటారు కానీ విధ్వంసాన్ని కోరుకోరని, ఆ విషయం కూటమి నేతలు గుర్తిస్తే మంచిదన్నారు. మీరొచ్చిన రెండు వారాల్లో ఎన్ని గొడవలు? ఎన్నెన్ని కొట్లాటలు? అని ఎద్దేవా చేశారు. కోట్ల స్థానికత ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ 40 ఏళ్ల రాజకీయంలో మీరేం చేశారో చెప్పాలన్నారు.
గతంలో సీఎంగా ఉండి ఏం చేశారో , ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.