NEWSTELANGANA

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటా

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

వేముల‌వాడ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ జిల్లా వేముల వాడలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ఇచ్చిన హామీ మేర‌కు వ‌చ్చే ఆగ‌స్టు 15 లోపు ప్ర‌తి రైతుకు రూ. 2 ల‌క్ష‌ల రుణాలు మాఫీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు.

బీఆర్ఎస్ నాయ‌కులు కావాల‌ని త‌న‌ను టార్గెట్ చేశార‌ని, వారికి అంత సీన్ లేద‌న్నారు సీఎం. తాను మాటివ్వ‌న‌ని ఇస్తే త‌ప్ప‌న‌ని అన్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డంతో రుణాల‌ను మాఫీ చేయ‌డం ఇబ్బంది క‌రంగా మారింద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.

జూన్ 4తో దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ పూర్త‌వుతుంద‌ని, ఆ త‌ర్వాత ద‌శ‌ల వారీగా మాపీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.