NEWSTELANGANA

కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌ప్ప‌దు

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మార్నింగ్ వాక్ చేశారు. ఇందులో భాగంగా కూర‌గాయ‌ల మార్కెట్ ను సంద‌ర్శించారు. విక్ర‌య‌దారుల‌తో ముచ్చ‌టించారు. త‌మ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేటీఆర్ కోరారు.

ప్ర‌జ‌ల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆద‌రించ‌ర‌ని, మార్పు త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు గంప గుత్త‌గా బీఆర్ఎస్ పార్టీని గెలిపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేటీఆర్. ఆరు గ్యారెంటీలు కావ‌ని గార‌డీలు అంటూ ఎద్దేవా చేశారు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌లో భారీ ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టారు. రైతు బంధ‌/, ద‌ళిత బంధు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు కేటీఆర్. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 2 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఇప్పటి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

తాము ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే వాటికి సంబంధించి ఫ‌లితాలు వెల్ల‌డించి తామే భ‌ర్తీ చేశామంటూ చెప్పుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.