NEWSNATIONAL

జే షాకు బ్యాటింగ్ వ‌చ్చా

Share it with your family & friends

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు. ఆయ‌న వ‌ల్ల‌నే కొడుకుకు దేశంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి కార్య‌ద‌ర్శి ప‌ద‌వి వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

త‌మ కూట‌మిలోని ప్ర‌తిప‌క్షాల‌ను ప‌దే ప‌దే అమిత్ షా వార‌స‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. 73 ఏళ్ల వ‌య‌సు ఉన్న అమిత్ షా మ‌రోసారి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న‌కు ఎందుకు రాజ‌కీయాలంటూ ప్ర‌శ్నించారు.

మ‌రో మంత్రి అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా ఉన్నార‌ని, త‌న త‌మ్ముడు ఐపీఎల్ చైర్మ‌న్ గా ఎలా ఎన్నిక‌వుతారంటూ నిల‌దీశారు ఎంపీ సంజ‌య్ సింగ్. ఈసారి జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌త కూట‌మి విజ‌యం సాధించ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు.

మోదీ మాయ మాట‌ల‌ను జ‌నం న‌మ్మ బోరంటూ పేర్కొన్నారు. జే షా వ్యూహాలు , జిమ్మిక్కులు ప‌ని చేయ‌వ‌ని పేర్కొన్నారు.