బాబూ లక్ష కోట్ల సంగతి ఏంటి..?
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
కర్నూలు జిల్లా – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా డోన్ లో మీడియాతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడుకు రోజు రోజుకు వయసు పెరిగినా బుద్ది రావడం లేదన్నారు. తను ఏపీకి సీఎంగా ఉన్న కాలంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారని, ముందు దానిని ఎలా తీరుస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
ఆయన తీసుకు వచ్చిన అప్పులను తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పై మండిపడ్డారు. ఒక్కసారి తనతో పాటు వచ్చి డోన్ లో తిరగాలని సవాల్ విసిరారు.
కోవిడ్ టైంలో శానిటైజర్ వాడడం తప్పా? ఆ సమయంలో వాడకుంటే కదా తప్పు? అని నిలదీశారు . ఇక పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించిన మీరేం సాధించారో చెప్పాలని అన్నారు. డోన్ ను కాపాడుకోవడానికి అదేమన్న మీ హయాంలో లాగా ఫ్యాక్షన్ సంస్కృతిలో ఉందా అని మండి పడ్డారు.
ప్రతి దానికి పన్నులు చెల్లించిన తాను ఆర్థిక నేరస్థుడిని ఎలా అవుతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.