NEWSTELANGANA

కేసీఆర్..ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ ఆయ‌న మాట‌ల తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ద‌మ్ముంటే త‌న స‌వాల్ ను స్వీక‌రించాల‌ని డిమాండ్ చేశారు.

ఇందుకు సంబంధించి స్థ‌లంతో పాటు తేదీ కూడా ప్ర‌క‌టిస్తున్నాన‌ని చెప్పారు. మే 9న హైద‌రాబాద్ లోని అమ‌ర వీరుల స్థూపం ముందు చ‌ర్చ పెడ‌దామ‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. అమ‌ర వీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా ఒక‌వేళ బ‌కాయి ఉన్న‌ట్టు తేలితే తాను ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెబుతాన‌ని ప్ర‌క‌టించారు సీఎం.

ఒక‌వేళ రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రైతులంద‌రికీ అమ‌లు చేస్తే కేసీఆర్ నీ ముక్కు నేల‌కు రాసి సారీ చెబుతావా అంటూ నిల‌దీశారు. ఇదిలా ఉండ‌గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ ఏం ఉద్ద‌రించాడో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఒక‌రిపై రాళ్లు రువ్వే ముందు మీరేం చేశారో వెన‌క్కి చూసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు సీఎం.