NEWSTELANGANA

ప్ర‌మాదంలో భార‌త రాజ్యాంగం

Share it with your family & friends

ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్ ఆకునూరి ముర‌ళి

ఆదిలాబాద్ జిల్లా – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోరం క‌న్వీన‌ర్, మాజీ సీనియ‌ర్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడు కోవాల‌ని కోరుతూ ఎస్డీఎఫ్ ఆధ్వ‌ర్యంలో జాగో తెలంగాణ పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. ఇప్ప‌టికే ఇటీవ‌లే జ‌రిగిన రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల సంద‌ర్బంగా యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

శ‌నివారం బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో కార్న‌ర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేవెళ్ల‌, జ‌హీరాబాద్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. దేశాన్ని పెట్టుబ‌డిదారుల‌కు తాక‌ట్టు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆరోపించారు.

ప్ర‌తి ఏడాదికి 2 కోట్ల చొప్పున జాబ్స్ ఇప్పిస్తామ‌ని న‌మ్మించాడ‌ని, తీరా 10 వేల పోస్టులు కూడా భ‌ర్తీ చేయ‌లేక పోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంద‌న్నారు. కేవ‌లం కులం, మ‌తం ఆధారంగా రాజకీయాలు చేస్తూ ప‌వ‌ర్ లోకి రావాల‌ని మ‌రోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యార‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు ఆకునూరి ముర‌ళి.