మోదీ మోసం రైతులకు శాపం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మోదీని ఏకి పారేశారు. జనాన్ని మోసం చేయడంలో సక్సెస్ అయ్యారంటూ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఎంపై భగ్గుమన్నారు.
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాడిన రైతులపై మోదీ కక్ష కట్టారని ఆరోపించారు. ఉల్లి ఎగుమతిపై విధించిన నిషేధాన్ని గత్యంతరం లేక వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు రాహుల్ గాంధీ. పదేళ్లుగా తనకు సంబంధించి ప్రచారం చేసు కోవడంతోనే సరి పోయిందన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మోదీకి గుణపాఠం తప్పదన్నారు . పలువురు రైతులు తట్టుకోలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇప్పటి వరకు పరిహారం అందించ లేదని ఆరోపించారు. ఇన్నేళ్లుగా ప్రధానమంత్రి చేసింది ఏమీ లేదన్నారు. అప్పులు చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.
రైతు సమస్యలపై పీఎం స్పందించిన పాపాన పోలేదన్నారు. 40 శాతం ఎగుమతి పన్ను విధించడం దారుణమన్నారు.