ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ – భారత కూటమి ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కన్హయ్య కుమార్ కు మద్దతుగా ఆప్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సైతం మద్దతు ప్రకటించారు. భారీ ఎత్తున యువ నాయకుడికి సాదర స్వాగతం పలికారు
ప్రస్తుతం దేశంలో న్యాయానికి నేరానికి మధ్య యుద్దం జరుగుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తానని నమ్మించాడని, తీరా 10 ఏళ్లు గడిచాక ఇప్పటి వరకు కనీసం 50 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయారని దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవాళ అణగారిన వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కన్హయ్య కుమార్. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లు కొల్లగొట్టాలని పీఎం మోదీ , అమిత్ చంద్ర షా త్రయం ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు .