బీఆర్ఎస్..బీజేపీకి ఓటమి తప్పదు
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్
ఖమ్మం జిల్లా – పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రెండు పార్టీలు ఒకే ఆకుకు చెందినవేనంటూ మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా పాలించిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అభివృద్ది పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని, తమపై పెను భారం మోపారని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులను తీర్చలేక తల్లడిల్లు పోతున్నామని వాపోయారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ప్రజలను కులం పేరుతో, మతం పేరుతో విడదీసి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆరు నూరైనా సరే ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 14 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.