NEWSANDHRA PRADESH

అన్నా ఒక్క‌సారి అద్దం చూసుకో

Share it with your family & friends

ఒక్క‌సారి ముఖం చూసుకో

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. రాష్ట్రంలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ స‌ర్కార్ కు చంద్ర‌బాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ, జ‌న‌సేన , బీజేపీ తో కూడిన కూట‌మితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి.

ఈ త‌రుణంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వంత చెల్లెలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌న చిన్నాన్న‌, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హ‌త్య చేయ‌డంపై ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌దీశారు. ప్ర‌ధానంగా చిన్నాన్న హ‌త్య కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు స‌పోర్ట్ చేస్తున్నావంటూ ప్ర‌శ్నించారు ఏపీ పీసీసీ చీఫ్‌.

హంతకుల‌ను ప‌క్క‌న పెట్టుకుని నీతి సూత్రాలు చెబితే జ‌నం న‌మ్ముతారా అని నిల‌దీశారు. త‌న తండ్రి, మ‌హా నాయ‌కుడు , దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ని తండ్రి అని చూడ‌కుండా ఛార్జిషీట్ లో పేరు న‌మోదు చేయించిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా అద్దాన్ని బ‌హుమ‌తిగా త‌న సోద‌రుడికి పంపిస్తున్న‌ట్లు చెప్పారు.