కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ది
మాజీ మంత్రి రఘు వీరా రెడ్డి
అనంతపురం జిల్లా – ఏపీ పీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి నీలకంఠాపురం రఘు వీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి జనాన్ని నవ రత్నాలు పేరుతో బురిడీ కొట్టించారంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోదీ ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. 100 హామీలలో 99 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి మాటలన్నీ అబద్దాలేనంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ అన్ని రంగాలలో అభివృద్ది పథంలో పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే , అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
ప్రజలను నిట్ట నిలువునా ముంచిన చంద్రబాబు , జగన్ రెడ్డిలకు జనం తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.