ఫాఫ్ డుప్లిసిస్ షాన్ దార్ షో
బెంగళూరు కెప్టెన్ సూపర్
బెంగళూరు – ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . గుజరాత్ టైటాన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది.
ప్రధానంగా ఆర్సీబీ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ , యష్ దయాల్ కళ్లు చెదిరే బంతులతో టైటాన్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. 149 రన్స్ టార్గెట్ విధించారు. షారుఖ్ ఖాన్ తో పాటు రాహుల్ తెవాటియా జట్టును ఆదుకున్నారు. గౌరవ ప్రదమైన స్కోర్ చేసేందుకు దోహద పడింది.
అనంతరం బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపింది. ప్రధానంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు స్కిప్పర్ ఫాఫ్ డుప్లిసిస్ షాన్ దార్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా కెప్టెన్ ఫాఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
కళ్లు చెదిరే షాట్స్ తో బిగ్ షాక్ ఇచ్చాడు. ఏకంగా 10 ఫోరర్లు 3 సిక్సర్లతో 64 రన్స్ చేశాడు. కోహ్లీ 42 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు.