జగన్ చాప్టర్ క్లోజ్ – బాబు
రాచరిక పాలనకు స్వస్తి పలకాలి
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాప్టర్ ఇక క్లోజ్ అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి, నూజివీడు, కాకినాడ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. ఓ వైపు ఎండలు కొనసాగుతున్నా లెక్క చేయకుండా, వయసు మీద పడుతున్నా ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు. జనం ఆదరణను చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ఎక్కడైనా ప్రభుత్వంతో కూడిన లోగో పాస్ పుస్తకాలపై ఉంటుందని, కానీ ఏపీలో మాత్రం విచిత్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం దారుణం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక రాబోయే కాలం టీడీపీ కూటమిదేనని చెప్పారు.
రాష్ట్రం బాగు కోసం, ప్రజా ప్రయోజనాల కోసం తాము పొత్తు కుదుర్చున్నామని స్పష్టం చేశారు మాజీ సీఎం.