కూటమి ఆరోపణలు అబద్దాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – తెలుగుదేశం పార్టీ కూటమి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనంటూ ధ్వజమెత్తారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు . ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు ఏపీ సీఎం.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందన్నారు. భూమిని ఎక్కడ కొనాలన్నా ఈరోజుల్లో వివాదాలు కనిపిస్తున్నాయని, దానిని నివారించేందుకే తాము ఈ చట్టాన్ని తీసుకు రావాలని అనుకున్నామని చెప్పారు జగన్ రెడ్డి.
భూ వివాదాలు పెరిగి పోవడంతో రైతన్నలు, ప్రజలు.. కోర్టులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. అందుకే రాబోవు రోజుల్లో ఏ ఒక్కరు కూడా వాళ్ల భూముల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.
వివాదాల పరిష్కారానికి కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి . ఆ భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ.. ఆ భూమిపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ సంస్కరణలు తీసుకు రావాలనేది మీ బిడ్డ ఆలోచన అని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.