గురుద్వారా సన్నిధిలో మోదీ
సమస్త ప్రజలకు మేలు జరగాలి
గురుద్వారా – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసిద్దమైన గురుద్వారా లోని శ్రీ కీర్తన్ నగర్ సాహిబ్ ను సందర్శించారు. కాన్పూర్ లోని గుమ్టిలో కొలువు తీరింది. గురుద్వారాకు రావడం తనకు ఎనలేని సంతోషాన్ని కలిగి ఇస్తోందన్నారు ప్రధానమంత్రి. గురుద్వారాను సందర్శించడం ప్రతిసారి ఆనవవాయితీగా వస్తోందని తెలిపారు. తాను దీనిని ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు పీఎం.
ఈ దేశంలోని 143 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని గురుద్వారా గ్రంథ్ సాహిబ్ ను కోరుకున్నట్లు తెలిపారు. ప్రార్థనా స్థలాన్ని సందర్శించిన విషయాన్ని స్వయంగా పంచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
సిక్కు గురువుల ఆలోచనలు, ఆదర్శాలు మానవాళిని ప్రకాశింప చేస్తూ లక్షలాది మందికి బలాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గురుద్వారాను ప్రతి ఒక్కరు సందర్శించుకుంటే మంచి జరుగుతుందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రాంతం ఏదైనా ఉందంటి అది గురుద్వారా మాత్రమేనని పేర్కొన్నారు.