NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డికి రుణ‌ప‌డి ఉన్నా

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాన‌ని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ బాస్ , సీఎం పై .

త‌మ మ‌ధ్య ఉన్న బంధం అన్నింటికంటే బ‌లీయ‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌ను మ‌రిచి పోలేనని అన్నారు. త‌న‌కు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తూనే వ‌స్తున్నార‌ని, జ‌గ‌న్ రెడ్డికి ఏమిచ్చి రుణః తీర్చుకోగ‌ల‌న‌ని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి.

వ్య‌క్తిగ‌తంగా త‌న అభివృద్దికి స‌హ‌క‌రించడ‌మే కాదు రాజ‌కీయ ప‌రంగా తాను ఎదిగేందుకు, ఉన్న‌త స్థానాల‌లో కొలువు తీరేలా జ‌గ‌న్ రెడ్డి చేసిన కృషి , సాయం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ అభ్య‌ర్థి.

నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో నాపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని నేను పుట్టిన గడ్డకు తెలియజేయడం మరువలేని అనుభూతి అని స్ప‌ష్టం చేశారు. ఆయనకు నాపైగల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తానని మాటిస్తున్నానని చెప్పారు.