పడ కేసిన ప్రజా పాలన
హరీశ్ రావు ఆవేదన
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తన ప్రచారం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. ఇదేనా మీ ప్రజా పాలన అంటూ ఎద్దేవా చేశారు. తాను చేసిన సవాల్ ను స్వీకరించ లేక రాద్దాంతం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీశ్ రావు.
ఇక నైనా తాను చేస్తున్న తప్పేమిటో గుర్తిస్తే మంచిదన్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు సర్వీస్ కేవలం సగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు. ఇక మిగతా ఐదులో ఒక్కటన్నా అమలు చేశారా అని నిలదీశారు. ఈ విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
ప్రతిరోజూ ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తాడు, మాది ప్రజాపాలన అన్నారని ..ఇప్పటి వరకు ఒక్క రోజు మాత్రమే కలిశాడని ఆరోపించారు హరీశ్ రావు. రెండో రోజు మంత్రులు వెళ్లారని, హడావుడి చేశారని ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ బయట కంచెలు తీసి వేయించిన రేవంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడని ఆరోపించారు.