బాబుది ఊసరవెల్లి రాజకీయం
ధ్వజమెత్తిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేపట్టిన మేమంతా సిద్దం యాత్రకు భారీ ఎత్తున జనం సాదర స్వాగతం పలికారు. బాబుది ఊసర వెల్లి రాజకీయం అని ఎద్దేవా చేశారు. ఆయనను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఈసారి అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.
ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వ బోతున్నారని, కూటమి నాటకాలను పసిగట్టారని అందుకే నవ రత్నాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న తమ సర్కార్ కు తిరిగి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.
నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒక పక్క జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమని నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టాడని ధ్వజమెత్తారు.
తాను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా.. ఆరు నూరైనా మైనారిటీలకి 4 శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
ఇది మీ వైయస్‌ఆర్ బిడ్డ జగన్ మాట. ముస్లింల రిజర్వేషన్ కోసం ఎందాకైనా పోరాడతా.. మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? ఎన్డీయే నుంచి బయటికి రాగలడా? అని ప్రశ్నించారు సీఎం.