SPORTS

జ‌ట్టు ఎంపికపై దాదా కామెంట్

Share it with your family & friends

ఇదే అత్యుత్త‌మ టీమ్

కోల్ క‌తా – వ‌చ్చే జూన్ నెల‌లో అమెరికా, విండీస్ ల‌లో జ‌రిగే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఆడే భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ఈ సంద‌ర్బంగా తాజా, మాజీ క్రికెట‌ర్లు, క్రికెట్ విశ్లేష‌కులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అజిత్ అగార్క‌ర్ సార‌థ్యంలోని సెలెక్ష‌న్ క‌మిటీ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం టీమిండియాను ఖ‌రారు చేసింది. ప్ర‌ధానంగా కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇక ర‌హ‌దారి ప్ర‌మాదం త‌ర్వాత రంగంలోకి దిగిన రిష‌బ్ పంత్ ను సైతం తీసుకోవ‌డం ఒకింత చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇదే స‌మ‌యంలో బీసీసీఐ మాజీ చీఫ్ , మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కోల్ క‌తాలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

టీమిండియా ఎంపిక‌పై తీవ్రంగా స్పందించారు. తాను చూసిన అత్యుత్త‌మ జ‌ట్టులో ఇది ఒక జ‌ట్టు అని పేర్కొన్నారు సౌరబ్ గంగూలీ. ఇత‌ర జ‌ట్ల గురించి తాను కామెంట్ చేయ‌ద‌ల్చు కోలేద‌ని పేర్కొన్నాడు మాజీ బీసీసీఐ చీఫ్‌. ఏది ఏమైనా ప్ర‌స్తుతం ఎంపిక చేసిన టీమ్ సూప‌ర్ అని స్ప‌ష్టం చేశాడు.