NEWSANDHRA PRADESH

ఆధారాలుంటే నిరూపించండి

Share it with your family & friends

బాబుతో జ‌త క‌ట్ట‌డం అబ‌ద్దం

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న మాన‌సిక స్థితి స‌రిగా లేద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడుతో తాను జ‌త క‌ట్టిన‌ట్లు వైసీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించారు. అన్నీ అబ‌ద్దాలు త‌ప్పా వాస్త‌వం కాద‌న్నారు.

ద‌మ్ముంటే ఆధారాల‌తో స‌హా రావాల‌ని స‌వాల్ విసిరారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కావాల‌నే తాను నీకు అద్దం పంపిస్తున్నాన‌ని, మీరు మాయ పొర‌ల్లో దాగి ఉన్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. నేను ఏనాడైనా చంద్ర‌బాబును క‌లిసిన‌ట్టు, లేదా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు నిరూపించ గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు.

ఒక‌వేళ తాను కంట్రోల్ చేస్తున్న‌ట్లు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు . ఇందుకు సంబంధించి ఒక్క సాక్ష్యం అయినా లేదా ఒక్క ప్రూఫ్ అయినా చూపించ గ‌ల‌రా అని నిల‌దీశారు. జ‌గ‌న్ రెడ్డి భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నాడ‌ని ఆరోపించారు. దివంగ‌త వైఎస్సార్ పేరు చెప్పుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ రెడ్డి ఆ త‌ర్వాత మ‌రిచి పోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.