NEWSTELANGANA

మోదీ నాయ‌క‌త్వం అవ‌స‌రం

Share it with your family & friends

బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నాయ‌క‌త్వం దేశానికి అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. మోదీకి ఓటు వేసేందుకు 101 కార‌ణాలు అనే పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం దేశాన్ని కొన్ని శ‌క్తులు నిర్వీర్యం చేయాల‌ని అనుకుంటున్నాయ‌ని ఆవేద‌న చెందారు.

దీనిని ప‌సిగ‌ట్టిన ప్ర‌ధాన‌మంత్రి ముందు జాగ్ర‌త్త‌గా మేల్కొన్నార‌ని చెప్పారు. క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని , ప్ర‌పంచంలోనే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు బండి సంజ‌య్ కుమార్ పటేల్.

ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ పార్టీలతో కూడిన ఎన్డీయేకు క‌నీసం 400కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు ఎంపీ. మోదీ హ‌వాను అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేద‌న్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రాబోయే ఐదేళ్ల‌లో వ‌ర‌ల్డ్ లోనే భార‌త్ అత్యంత వేగవంత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌న్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌కుడు మోదీనేన‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.