అన్నా ఈ ప్రశ్నలకు బదులేది
మరోసారి లేఖ రాసిన షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఆమె మరోసారి లేఖ రాశారు తన అన్న సీఎంకు. ధరలు, ఛార్జీలు పెరుగుదలపై నిలదీశారు. నవ సందేహాలను వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ధరలు పెరుగుదలతో ప్రజలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించే ఉపశమన చర్య 5 ఏళ్లలో ఒక్కటి తీసుకోలేదు ? ఎందుకని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర తో సంబంధం లేకుండా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
విద్యుత్ చార్జీలు పెంచమని వాగ్ధానం చేసి.. ప్రజల మీద 13 వందల కోట్ల భారాన్ని ఎందుకు మోపారని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. పెట్రోల్,డీజిల్ మీద 500 కోట్లు, ఆర్టీసీ చార్జీల ద్వారా 700 కోట్లు, మద్యంపై 18 వందల కోట్ల మేర ధరలు పెంచి ప్రజలపై ఎందుకు మోపారని మండిపడ్డారు.
పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల కింద తగ్గించే అవకాశం ఉన్నా..ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదన్నారు. యూనివర్సిటీ లో ప్రమాణాలు పెంచకుండా విద్యార్థుల ఫీజులను 2850 కి ఎందుకు పెంచారని అన్నారు.
ఇసుక ధరలను 5 రెట్లు పెంచి నిర్మాణ రంగాన్ని దెబ్బ తీశారని వాపోయారు.40 లక్షల మంది కార్మికుల జీవనోపాధి పై ఎందుకు దెబ్బ కొట్టారని అన్నారు. ఈ ఏడాదిలోనే 10 వేల కోట్ల పన్నులు పెంచారని..అదే స్థాయిలో 47 వేల కోట్ల అప్పులు తెచ్చారని మండిపడ్డారు.