మోదీకి భంగపాటు తప్పదు
మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ కూటమికి భంగపాటు తప్పదని అన్నారు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమికి ఆశించిన దానికంటే ఎక్కువగా స్థానాలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
దేశ వ్యాప్తంగా భారత కూటమికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని అన్నారు. కానీ మోదీ మాత్రం ఇంకా కలల్లో తేలి యాడుతున్నారని, ఆయనకు ఈసారి షాక్ తప్పదన్నారు. విచిత్రం ఏమిటంటే 400 సీట్లు ఏ ప్రాతిపదికన వస్తాయని ప్రశ్నించారు.
ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో దేశాన్ని భ్రష్టు పట్టించారని, ధనవంతులకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారని, దేశానికి చెందిన వనరులను కట్ట బెట్టారని ఇంక ఏం మిగిలి ఉందని ప్రశ్నించారు అశోక్ గెహ్లాట్. పూర్తిగా తమ అలయన్స్ కు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు.
అదానీ, అంబానీలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తూ వచ్చారని అన్నారు. మోదీ చేసిన మోసం గురించి ప్రజలకు అర్థమై పోయిందన్నారు. ఆయనకు ప్రచారం తప్ప ఇంకే పనీ లేదన్నారు.