సునీల్ నరైన్ సెన్సేషన్
81 రన్స్ ఒక వికెట్ ..ఆల్ రౌండ్ షో
లక్నో – సునామీ అంటే ఏమిటో..పరుగులు ఎలా రాబట్టు కోవాలో చూడాలంటే సునీల్ నరైన్ ఆటను చూస్తే సరి పోతోంది. ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన ఈ క్రికెటర్ ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ప్రధానంగా కీలకమైన పాత్ర పోషిస్తూ తన జట్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు.
ఓ వైపు కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపుతూనే మరో వైపు తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా లక్నో వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సునీల్ నరైన్.
కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 6 ఫోర్లు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 81 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన లక్నో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. 16.1 ఓవర్లలోనే 137 పరుగులకే చాప చుట్టేసింది. స్టోయినిస్ ఒక్కడే ఆడాడు లక్నో జట్టులో. తను 4 ఫోర్లు 2 సిక్సర్లతో 36 రన్స్ చేశాడు. మిగతా ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు.
ఇక కోల్ కతా బౌలింగ్ పరంగా చూస్తే టాప్ లో ఉంది. హర్షిత్ 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే చక్రవర్తి 30 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. ఇక 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు రస్సెల్. ఇక నరైన్ 4 ఓవర్లలో 22 రన్స ఇచ్చి ఒక వికెట్ తీశాడు.