మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్
విడుదల చేసిన బంగ్లాదేశ్ ప్రధాని
బంగ్లాదేశ్ – ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు లెక్కలేనంత జోష్ కలగనుంది. పురుషులకు సంబంధించి ఇదే ఏడాది జూన్ నెలలో అమెరికా, విండీస్ లలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే ఆయా జట్లు పూర్తి స్థాయిలో ఆటగాళ్లను ఎంపిక చేశాయి ఆయా క్రికెట్ బోర్డులు.
తాజాగా ఇదే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ను నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ కు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది.
విచిత్రం ఏమిటంటే ఒకే గ్రూప్ లో ఇండియా మహిళల జట్టు, బంగ్లాదేశ్ విమెన్స్ జట్టు ఆడనున్నాయి. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఎగరేసుకు పోయింది. ఇదిలా ఉండగా ఐసీసీ పూర్తి జట్ల షెడ్యూల్ ను విడుదల చేసింది.
అక్టోబర్ 3 నుంచి 20 దాకా బంగ్లాదేశ్ లోని షేర్ ఏ బంగ్లా, సిల్హెట్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయని తెలిపింది ఐసీసీ. ఈ బిగ్ టోర్నీలో ఆయా జట్లను రెండు గ్రూపులుగా విభజించింది ఐసీసీ.
గ్రూప్ – ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆడతాయి. గ్రూప్ – బిలో బంగ్లాదేశ్ , ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. రెండు గ్రూప్ లను టాప్ లో ఉన్న జట్లు అర్హత సాధిస్తాయి. కాగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇక 4న కీవీస్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా 6న పాకిస్తాన్ తో తలపడనుంది.