దోపిడీ రాజ్యం దొంగల పెత్తనం
నిప్పులు చెరిగిన షర్మిల రెడ్డి
నెల్లూరు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఏపీ న్యాయ యాత్రకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. షర్మిలకు జేజేలు పలికారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పుల రాజు బరిలో ఉన్నారు.
ఈ సందర్బంగా ప్రజలను ఉద్ధేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. ప్రధానంగా ఆమె తన సోదరుడు, సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన చిన్నాన్న చంపిన హంతకులకు ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. గత కొంత కాలంగా సీఎంను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.
కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో సీరియస్ కామెంట్స్ చేశారు షర్మిల. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం కొనసాగుతోందన్నారు. దొంగల పెత్తనం ఇంకా ఎంత కాలం సహించాలని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలు మేల్కోవాలని లేక పోతే ఇబ్బందులు తప్వవంటూ హెచ్చరించారు ఏపీ పీసీసీ చీఫ్.
జగన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మొత్తం మాఫియా మయంగా మారిందన్నారు. ఇసుక, భూ, దోపిడీ మాయ కొనసాగుతోందన్నారు షర్మిల.