NEWSANDHRA PRADESH

భూ చ‌ట్టం ప్ర‌జ‌ల పాలిట శాపం

Share it with your family & friends

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పి. కృష్ణ‌య్య

అమ‌రావ‌తి – సీనియ‌ర్ ఆఫీస‌ర్ పి. కృష్ణ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర స‌ర్కార్ గ‌నుక భూ యాజ‌మాన్య హ‌క్కు చ‌ట్టంను అమ‌లు చేస్తే అది ప్ర‌జ‌ల పాలిట శాపంగా మార‌నుంద‌ని హెచ్చ‌రించారు.
జనచైతన్య వేదిక ఆధ్వ‌ర్యంలో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

డాక్టర్ పి. కృష్ణయ్య ప్రసంగిస్తూ చట్టంలో చెప్పిన నిర్దిష్ట కాలంలో లీజులు, తనఖాలు, ఇతర అన్యాక్రాOతాలు, క్రయ విక్రయాలను భూమి ఆస్తి హక్కు అధికారి వద్ద నమోదు చేయడంలో ఆస్తి యాజమానులు విఫలమైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండించారు.

భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ స్థానాలను నుంచి తొలగించి ,ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింప చేయటం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమ‌వుతాయ‌ని హెచ్చ‌రించారు.

ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందు పరచడం ఆక్షేపనీయమన్నారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. దివాకర్ బాబు ప్రసంగిస్తూ భూహక్కు కొత్త చట్టం దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, నిరీక్షరాస్యుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్నారు.

లబ్ధిదారుల పేర్లలో మార్పులు, చేర్పులు సంబంధిత రిజిస్టర్ లో చేర్చినప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించి చేతులు దులుపు కోవడం హాస్వాస్పదమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లoరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రజలలో ఎలాంటి చర్చ జరపకుండా హడావుడిగా భూ హక్కు చ‌ట్టాన్ని తీసుకొని రావడాన్ని ప్రశ్నించారు.

భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయక పోయినా ఒక్క ఆంధ్రప్రదేశ ముందుకు రావడం దేని కోసమని అన్నారు .అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న రెవెన్యూ యంత్రాంగం చేతిలో భూహక్కు చట్టాన్ని ఉంచటం, న్యాయ వ్యవస్థను దూరంగా ఉంచటం సహేతుకం కాదన్నారు.