కూటమిని నమ్మని జనం
చంద్రబాబు మాయలోడు
నెల్లూరు జిల్లా – నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ కూటమిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ, జనసేన కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో బక్వాస్ అని ఎద్దేవా చేశారు.
సూపర్ సిక్స్, డబుల్ సెంచరీలంటూ ఎన్నీ హామీలిచ్చినా చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని ఆరోపించారు. టిడిపి మేనిఫెస్టోను మాయఫెస్టో అంటున్నారని ఎద్దేవా చేశారు. అంతకు ముందు 14 ఏళ్లలో చెప్పుకోవడానికి ఆయన చేసిందేమీ లేదన్నారు.
అందుకే జగన్ పై శాపనార్థాలు మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎంపై భౌతిక దాడులకు ఉసి గొల్పడం, అమలులో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో ప్రజలను ఆందోళనకు గురి చేయడం దారుణమన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని చెప్పారు విజయ సాయి రెడ్డి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఏ ఒక్కరూ నమ్మడం లేదని పేర్కొన్నారు.