నగరిలో గెలుపు నాదే – రోజా
భారీ మెజారిటీ పైనే ఫోకస్
చిత్తూరు జిల్లా – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరిలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆరు నూరైనా సరే, ఎవరు అడ్డుకున్నా సరే అంతిమ విజయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు మంత్రి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, చవరంబాకం,కె.ఆర్.పురంలలో పర్యటించారు. ఈ సందర్బంగా వైసీపీ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టారు. భారీ ఎత్తున జనం ఆమెను ఆదరించారు. సాదర స్వాగతం పలికారు.
వైసీపీ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి. అభివృద్ది కావాలంటే తమను గెలిపించాలని కోరారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఆదరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను ఈ ప్రాంతపు ప్రజలను మరిచి పోలేనని అన్నారు.
రాష్ట్రంలోని అత్యధిక ప్రజలంతా మరోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి. నవ రత్నాటు ప్రజలకు కష్ట కాలంలో భరోసా కల్పించాయని తెలిపారు.