NEWSANDHRA PRADESH

నేరానికి న్యాయానికి మ‌ధ్య పోరు

Share it with your family & friends

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి
క‌డ‌ప జిల్లా – ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు న్యాయానికి, నేరానికి మ‌ధ్య జ‌రుగుతున్నాయ‌ని
స్ప‌ష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సోమ‌వారం ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

గొడ్డ‌లి అవినాష్ రెడ్డి కావాలా లేక కొంగు చాపి న్యాయం కావాల‌ని అడుగుతున్న వైఎస్ ష‌ర్మిల కావాలో తేల్చు కోవాల‌ని అన్నారు. క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు న్యాయం వైపు నిల‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌మ్ముడు , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వారికి ఇప్ప‌టి వ‌ర‌కు శిక్ష ప‌డ‌లేద‌న్నారు. మ‌రి ఇక రాష్ట్ర ప్ర‌జ‌ల సంగ‌తి ఏమిటి అని ప్ర‌శ్నించారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా సంపాదించాడ‌ని ఆరోపించారు . య‌ధేశ్చ‌గా బెట్టింగ్ ల కు పాల్ప‌డ‌టం దారుణ‌మ‌న్నారు. గుట్కా, మ‌ట్కా వ్యాపారం జోరుగా సాగుతోంద‌న్నారు. ఇక దొంగ నోట్ల బిజినెస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌.

మూడు పువ్వులు..ఆరు కాయ‌లుగా దోపిడీలు చేస్తున్నారంటూ ఆరోపించారు. దోచుకున్న డ‌బ్బులన్నీ మొత్తం మీవేన‌ని అన్నారు . ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం త‌న‌కు వేయాల‌ని కోరారు ఏపీ పీసీసీ చీఫ్‌.