భూ హక్కు చట్టం ప్రమాదకరం
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీలో ప్రవేశ పెట్టబోయే భూ హక్కు చట్టం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఐఏఎస్ ఆఫీసర్ గా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలు అందించిన రమేష్ సైతం భూమికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఆయనకే అలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు .
భూ హక్కు చట్టం వల్ల తీవ్రమైన ఇబ్బందులు సామాన్యులకు ఏర్పడతామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇళ్లు, మీ స్థలం, మీ పొలం మీది కాకుండా పోతుందన్నారు.
ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్లాన్ చేశాడని ఆరోపించారు. ఒకవేళ ఇది గనుక అమలు అయితే ప్రజలకు చెందిన స్థలాలు, ఆస్తులు వారి పేరు మీద ఉండవన్నారు. వారికి హక్కులు కూడా వర్తింప చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండక పోతే రాబోయే రోజుల్లో చని పోయేందుకు గజం స్థలం కూడా దొరకదని అన్నారు చంద్రబాబు నాయుడు.