NEWSNATIONAL

అంకురాల‌లో అతివల హ‌వా

Share it with your family & friends

భారీ ఎత్తున స్టార్ట‌ప్ ల ఏర్పాటు

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. ప్ర‌ధానంగా చోటు చేసుకున్న సాంకేతిక ప‌ర‌మైన మార్పుల‌ను గ‌మ‌నించిన వీరంతా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేందుకు ప్ర‌యోగాత్మ‌కంగా కొత్త‌గా ఆలోచిస్తున్నారు. ఈ మేర‌కు త‌మ‌కు తోచిన ఆలోచ‌న‌ను ఎలా మార్కెట్ చేయాలో కూడా ప్ర‌యోగాత్మ‌కంగా వ‌ర్క‌వుట్ అయ్యేలా చూస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌లు గ‌త ఏడాది ఊహించ‌ని రీతిలో స్టార్ట‌ప్ ల‌ను ప్రారంభించ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే దేశంలోనే అత్య‌ధికంగా స్టార్ట‌ప్ లు పుట్టుకు వ‌చ్చిన న‌గ‌రం ఏదైనా ఉందంటే అది బెంగ‌ళూరు. ఇప్ప‌టికే ఐటీకి కేరాఫ్ గా మిగిలి పోయింది.

ఒక్క బెంగ‌ళూరులోనే 1,783 మంది మ‌హిళ‌లు అంకురాల‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాతి స్థానంలో ముంబై మ‌హిళ‌లు నిలిచారు. 1,480 మంది కొత్త‌గా స్టార్ట‌ప్ ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఢిల్లీకి చెందిన విమెన్స్ 1,195 మంది , గూర్గాన్ కు చెందిన 646 మంది, పూనేకు చెందిన 456 మంది మహిళ‌లు అంకురాల‌కు ప్రాణం పోశారు.

ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ కుచెందిన 437 మ‌హిళ‌లు , చెన్నైకి చెందిన 369 మంది, నోయిడాకు చెందిన 324 మంది, కోల్ క‌తాకు చెందిన 184 మంది , అహ్మ‌దాబాద్ కు చెందిన 181 మంది మ‌హిళ‌లు అంకురాల‌కు అంకురార్ప‌ణ చేశారు.