ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిపై వేటు
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీలో ప్రస్తుతం ఈనెల 13న ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. భారీ ఎత్తున రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అయితే డీజీపీగా ప్రస్తుతం ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెంటనే స్పందించి సీఈసీ.
ఆ మేరకు ఆయనను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను ఆదేశించింది. సీఈసీ ఆదేశాల మేరకు డీజీపీపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమించింది.
సీనియార్టీ జాబితాలోని ఐపీఎస్ ఆఫీసర్లను కూడా పరిగణలోకి తీసుకుంది సీఈసీ. ఈ మేరకు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్ , హరీశ్ కుమార్ గుప్తా పేర్లను ఈసీకి పంపించింది. చివరకు హరీశ్ కుమార్ గుప్తా వైపు కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపింది.