NEWSTELANGANA

బాధిత కుటుంబాలకు కోటి ఇవ్వాలి

Share it with your family & friends

డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ నేత‌, నాగ‌ర్ క‌ర్నూల్ బీఆర్ఎస్ పార్టీ లోక్ స‌భ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీరియ‌స్ అయ్యారు. క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయ‌ణ రెడ్డి వాహ‌నం మితి మీరిన వేగంతో ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు.

వారిలో ప‌బ్బ‌తి న‌రేష్, బైర‌పాక ప‌రుశురాములు చ‌ని పోవ‌డంతో వారి కుటుంబాలు దిక్కు తోచ‌ని స్థితిలో ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వారిని ప‌రామ‌ర్శించిన పాపాన పోలేదంటూ ఎమ్మెల్యే క‌సిరెడ్డి నారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. క‌నీసం మాన‌వ‌త్వం అన్న‌ది లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు.

అధికారం ఉంది క‌దా అని ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు లేదా ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన వారైతే ఇలాంటి సంఘ‌ట‌న‌లో చ‌ని పోతే ప‌రామ‌ర్శించ‌కుండా ఉంటారా అని ప్ర‌శ్నించారు.

చ‌నిపోయిన కుటుంబాల‌లో ఒక్కొక్క‌రికీ రూ. కోటి చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేక‌పోతే ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.