సంక్షేమం..సాధికారతే లక్ష్యం
స్పష్టం చేసిన ఆర్కే రోజా సెల్వమణి
చిత్తూరు జిల్లా – సంక్షేమం తమ నినాదమని, అభివృద్ది తమ ధ్యేయమని, సాధికారితే లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
జగన్ రెడ్డి ఎజెండా ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆ ఎజెండా ఏమిటంటే పేదరికం లేని , అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం అని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక మొదటగా మహిళల అభివృద్దిపై ఫోకస్ పెట్టారని తెలిపారు. అంతే కాకుండా విద్య, వైద్యం రంగాలను గతంలో ఎన్నడూ లేనంతగా మార్పులు చేశారని చెప్పారు.
ఇవాళ ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ ను మించిన వైద్య సాయం అందుతోందని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి. మరోసారి తనను, జగన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కూటమి చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. ఆయనను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వారికి పట్టుమని పది సీట్లు కూడా రావని పేర్కొన్నారు ఆర్కే రోజా సెల్వమణి.