NEWSNATIONAL

కేజ్రీవాల్ కు షాక్ క‌స్ట‌డీ పొడిగింపు

Share it with your family & friends

బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌న్న కోర్టు

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ తీహార్ జైలు పాలైన ఆప్ బాస్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ త‌గిలింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్నాయ‌ని, తాను పార్టీ చీఫ్ గా పాల్గొనాల్సి ఉంద‌ని , వెంట‌నే మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు సీఎం. ఆయ‌న జైలు నుంచే పాల‌న సాగిస్తున్నారు. ఆయ‌న త‌ర‌పున భార్య సావిత్రి కేజ్రీవాల్ క‌నుస‌న్నుల‌లో ప్ర‌స్తుతం పాల‌న కొన‌సాగుతోంది.

ఇది ప‌క్క‌న పెడితే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ప్ర‌ధాన సూత్ర ధారి , కింగ్ పిన్ కేజ్రీవాల్ అంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంది. సుదీర్ఘ‌మైన నివేదిక ఇచ్చింది. ఇప్ప‌టికే ఆప్ కు చెందిన డిప్యూటీ సీఎం సిసోడియా, మంత్రి జైన్ తో పాటు ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ ను అరెస్ట్ చేసింది. కానీ ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌ల‌య్యారు సంజ‌య్ సింగ్. కానీ సీఎం మాత్రం ఇంకా జైలులోనే గ‌డపాల్సి వ‌స్తోంది.

త‌న అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని, త‌న‌ను కావాల‌ని కేసులో ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. తాను ఎవ‌రి వ‌ద్దా ఒక్క పైసా కూడా తీసుకోలేద‌ని ఆరోపించారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈడీ, సీబీఐ , ఐటీ ప‌లుమార్లు దాడులు చేసినా ఒక్క రూపాయి కూడా దొర‌క‌లేద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, ఆయ‌న క‌స్ట‌డీని ఈనెల 20 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు తీర్పు చెప్పింది కోర్టు.

ఈ మేరకు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.