బ్రిజ్ భూషణ్ కేసుపై తీర్పు వాయిదా
మే 10కి వాయిదా వేసిన కోర్టు
న్యూఢిల్లీ – కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ కోర్టు. ఈ మేరకు ఈ కేసుక సంబంధించి ఇంకా నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది. మంగళవారం కేసు విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. మహిళా మల్ల యోధులు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. చివరకు రోడ్డు ఎక్కారు. ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆయనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. చివరకు నిరసనకు దిగారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వారిపై ఖాకీలు దారుణంగా ప్రవర్తించారు. వారిపై చేయి చేసుకున్నారు. చివరకు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్ అయ్యారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్. ఆయన ఆదేశాల మేరకు కోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం తుది తీర్పు మే 10న రానుంది.