24న అంజ‌లి రెడ్డి ర‌ఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా : ఏపీపీఎస్సీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పోస్ట్ షేర్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌న ముద్దుల కూతురు నిశ్చితార్త‌రం గురించి తెలిపారు. త‌న తండ్రి , దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో త‌న కూతురు వైఎస్ అంజిలి రెడ్డి సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం అని పేర్కొన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం అని తెలిపారు.

ఈ నెల 24న నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని, వ‌చ్చే నవంబర్ నెల 25న పరిణయం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు ష‌ర్మిలా రెడ్డి. , అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందంగా ఉంద‌న్నారు. కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న YSR ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని వెల్ల‌డించారు షర్మిలా రెడ్డి. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుంద‌న్నారు.

  • Related Posts

    ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై హైకోర్టు అన‌ర్హ‌త వేటు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ పై దాఖ‌లైన కేసుకు సంబంధించి శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా త‌ను ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఆ త‌ర్వాత మ‌రో పార్టీలో…

    నా జీవితం తెరిచిన పుస్త‌కం : హ‌రీష్ రావు

    సిద్దిపేట : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం సిద్దిపేట‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న జీవితం తెరిచిన పుస్త‌కం అని అన్నారు. ఎవ‌రు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా తాను ఏమీ భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు. త‌ప్పు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *