రాజ్యాంగాన్ని కాపాడుకోక పోతే కష్టం
ప్రజాస్యామ్యం ప్రమాదంలో ఉంది
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అత్యంత ప్రమాద పరిస్థితుల్లో ఉందని ఆవేదన చెందారు. దీనిని గుర్తించి కాపాడుకోక పోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చుతామని పదే పదే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మోదీ, షా ప్రకటిస్తూ వస్తున్నారని అత్యంత ప్రమాదకరమైన కామెంట్స్ గా పరిగణించక తప్పదన్నారు. ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. లేక పోతే రాబోయే రోజుల్లో అణగారిని, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు మనుగడ కష్టం అవుతుందని హెచ్చరించారు రాహుల్ గాంధీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ధనవంతులకు మేలు చేకూర్చేందుకే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వల్ల దేశం మరో 100 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. కేవలం కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదన్నారు రాహుల్ గాంధీ.