మోదీ దమ్ముంటే చర్చకు రా – కేసీఆర్
మోదీ మోసం తెలంగాణకు ద్రోహం
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఛానల్ తో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మోదీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచే ప్రజలు ఎక్కువగా పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించడం జరిగిందని చెప్పారు. కానీ కేంద్రం నుంచి నయా పైసా ఎక్కువ రాలేదన్నారు.
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 25,000 వేల కోట్లు. వీటిని రాకుండా చేసిన ద్రోహి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన మంత్రికి దమ్ముందా నాతో చర్చ పెట్టేందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధైర్యం ఉంటే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించారు కేసీఆర్. ప్రతి పైసాకు సంబంధించి లెక్క తన వద్ద ఉందన్నారు . తెలంగాణ నుంచి కేంద్రానికి ఎక్కువ వెళ్లిందా లేక కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయనేది తేలి పోతుందన్నారు.
వాస్తవాలు మాట్లాడుతున్న తనపై లేనిపోని ఆరోపణలు చేయించడం మంచి పద్దతి కాదన్నారు. ఇక సీఎం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. కేవలం అరవడం తప్ప ఆలోచన అన్నది లేదన్నారు కేసీఆర్.