NEWSNATIONAL

భార‌త కూట‌మిని ఆద‌రించండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన సోనియా గాంధీ

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ఇవాళ ప్ర‌జాస్వామ్యం అత్యంత ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న చెందారు. నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా అంటూ సంభోదించారు.

యువత నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష దారుణ‌మైన‌ స్థాయికి చేరుకుందని ఆవేద‌న చెందారు. మోడీ, బీజేపీ ప‌రివారం అంతా ఇప్పుడు ఎలాగైనా గెల‌వాల‌న్న క‌సితో ఉన్నారంటూ పేర్కొన్నారు. వారి ధ్యేయం ఒక్క‌టే ప్ర‌జ‌లు ఏమై పోయినా ప‌ర్వా లేదు. కానీ కొద్ది మంది బాగుంటే చాలు అన్న భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని వాపోయారు.

మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం, మన పేదలు వెనుకబడి ఉండటం , మన సమాజం నిర్మాణం నలిగి పోతున్నట్లు చూడటం నాలో వేదనను నింపుతుందని అన్నారు

ఈ రోజు, నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. మా ‘న్యాయ్ పత్ర’ , ఇచ్చిన హామీలు మన దేశాన్ని ఏకం చేసేందుకు దోహ‌ద ప‌డ‌తాయ‌ని తెలిపారు. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు , వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్, భారత పార్టీలు కట్టుబడి ఉన్నాయ‌ని తెలిపారు. అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తూ, ద్వేషాన్ని ఎగ‌దోస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టించి ఓట్లు కొల్ల గొట్టాల‌నే వారికి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు సోనియా గాంధీ.