NEWSANDHRA PRADESH

ప‌వ‌ర్ లోకి వ‌స్తా అన్నీ క్లియ‌ర్ చేస్తా

Share it with your family & friends

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – తాను అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న కూట‌మి ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని వారికి అంత సీన్ లేద‌న్నారు. మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. జిమ్మిక్కులు , మ్యాజిక్కులు ఇక్క‌డ ప‌ని చేయ‌వ‌ని అన్నారు. జ‌నం కోసం ఎవ‌రైతే క‌ష్ట ప‌డ‌తారో వారికే ప‌ట్టం క‌డ‌తార‌ని అన్నారు.

మోసాలు, అబ‌ద్దాలు, అస‌త్య‌పు ప్ర‌చారాల‌తో నెట్టుకు వ‌స్తున్న చ‌రిత్ర చంద్ర‌బాబు నాయుడుద‌ని ఎద్దేవా చేశారు. ఆరు నూరైనా తిరిగి ఏపీలో అధికారాన్ని చేప‌ట్ట బోయేది తామేనని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఇవాళ కోట్లాది రూపాయ‌ల‌ను కేవ‌లం ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేశామ‌న్నారు. విద్యా, వైద్య రంగాల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. అంతే కాదు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశామ‌ని తెలిపారు. ఇంత‌కంటే ఇంకేం కావాల‌న్నారు. కానీ పనిగ‌ట్టుకుని ల‌బ్దిదారుల‌కు పెన్ష‌న్లు అంద‌కుండా అడ్డుకున్నారంటూ బాబుపై మండిప‌డ్డారు సీఎం.