NEWSTELANGANA

మోదీ వ‌ల్ల ఒరిగింది ఏమిటి

Share it with your family & friends

మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీరు తెలంగాణ‌కు ఏం చేశార‌ని ఇక్క‌డికి వ‌స్తున్నారంటూ ప్ర‌శ్నించారు. నిరంత‌రం విషం చిమ్మ‌డం త‌ప్ప ఆదుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని నిల‌దీశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు .

ద‌య‌చేసి ఈ ప‌విత్ర‌మైన ఈ నేల‌పై విషం చిమ్మ‌వ‌ద్ద‌ని కోరారు కేటీఆర్. ద‌శాబ్ద కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప‌దేళ్లుగా పాలించిన మోదీ ఇచ్చిన హామీల‌ను ఎక్క‌డ అమ‌లు ప‌రిచారో చెప్పాల‌న్నారు.

ఒక్క తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వ‌లేద‌న్నారు. యువ‌త‌కు ఉపాధిని క‌ల్పించే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో జ‌వాబు ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నారు. త‌మ ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారో చెప్పాల‌న్నారు.
.
ఐటీఐఆర్ ప్రాజెక్టును కావాల‌ని ఆగం చేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు కేటీఆర్. తెలంగాణ‌కు న‌వోద‌య‌, మెడిక‌ల్ కాలేజీ, న‌ర్సింగ్ కాలేజీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐస‌ర్ , ఎన్ఐడీ ఎందుకు ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదో చెప్పాల్సిన బాధ్య‌త మోదీపై ఉంద‌న్నారు.