రేవంత్ రెడ్డికి ఈసీ షాక్
ఎన్నికలయ్యాక పంపిణీ చేయండి
హైదరాబాద్ – ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు బంధు పంపిణీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించింది. పంపిణీ అయి పోయిన వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. ఏ మాత్రం పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఈసీ.
రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమైన పదవిలో ఉన్న వారు ఇలా గీత దాటితే ఎలా అని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్ ఈ దేశంలో సామాన్యుడికి, సీఎంకు ఒకేలా ఉంటుందని స్పష్టం చేసింది. ఒకరికి ఒక లాగా మరొకరికి ఇంకొక లాగా ఉండదని సూచించింది.
సీఎం ముందు రూల్స్ ను ఫాలో కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయం తెలుసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా అని ప్రశ్నించింది. రైతు భరోసా ఎలా అమలైందని అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికలు అయి పోయాక రైతు భరోసా కింద సాయం చేయొచ్చని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.