తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ
17 స్థానాలలో గెలిచేది ఎవరో
తెలంగాణ – రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు ముగిశాయి. ఆ వాతావరణం నుంచి కోలుకోక ముందే తిరిగి లోక్ సభ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పటికే తేదీ కూడా ఖరారై పోయింది. ఎవరికి వారే తాము గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే అంతగా ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. ఇక గతంలో కంటే ఈసారి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందని టాక్. ఆ పార్టీకి సిట్టింగ్ లతో పాటు అదనంగా మరికొన్ని సీట్లు దక్కించుకుంటుందని అంచనా.
ఇక బీఆర్ఎస్ సైతం ఒకటి లేదా రెండు స్థానాలలో పాగా వేయనుందని , ఇక కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుందా లేక చతికిల పడుతుందా అన్నది జూన్ 4 తర్వాత తేలనుంది. ఇక ఎప్పటి లాగే ఎంఐఎం తన సీటు చేజిక్కించుకునే పనిలో పడనుంది.
ఇక లోక్ సభ నియజోకవర్గాల వారీగా చూస్తే రాష్ట్రంలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. ఏయే పార్టీల మధ్య పోరు ఉందనే దానిని బట్టి చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ గా ఉండే ఛాన్స్ ఆదిలాబాద్ , నిజామాబాద్ , జహీరాబాద్ , చేవెళ్ల, మహబూబ్ నగర్ , మల్కాజ్ గిరి, భువనగిరి ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పరంగా చూస్తే మహబూబాబాద్ ఒక్కటే ఉంది. ఇక త్రిముఖ పోరు పరంగా చూస్తే కరీంనగర్ , వరంగల్ , మెదక్ , సికింద్రాబాద్ , నాగర్ కర్నూల్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఖమ్మం, నల్లగొండ ఉన్నాయి. ఎంఐఎం హైదరాబాద్ వశం కానుంది.