NEWSANDHRA PRADESH

ప్ర‌జ‌ల ఆస్తుల‌పై జ‌గ‌న్ క‌న్ను

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు ఆరోప‌ణ‌

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్ప‌టికే వేల కోట్లు దోచుకున్న జ‌గ‌న్ రెడ్డి క‌న్ను ఇప్పుడు ప్ర‌జ‌ల ఆస్తుల‌పై ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని లేక పోతే మీ ఆస్తులు మీ చేతుల్లో ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు.

జ‌గ‌న్ రెడ్డి తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను బ‌ల‌వంతంగా తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. జ‌నం మేల్కోక పోతే మీకు చెందిన ఏ ఆస్తి మీ పేరు మీద ఉండ‌ద‌న్నారు. సైకో జ‌గ‌న్ రెడ్డి చేతుల్లోకి వెళ్లి పోతాయ‌ని, దానిని అడ్డం పెట్టుకుని మ‌రో భూ దందాకు తెర లేపాడ‌ని మండిప‌డ్డారు నారా చంద్ర‌బాబు నాయుడు.

విచిత్రం ఏమిటంటే త‌ర త‌రాల నుంచి ప్రజలకు తాతలు, తండ్రుల నుండి వచ్చిన ఆస్తులపై నీ ఫోటోలు ఎందుకు ఉండాల‌ని ప్ర‌శ్నించారు టీడీపీ చీఫ్‌. నా భూమి ప‌త్రాల‌పై ఈ సైకో ఫోటో ఎందుకు పెట్టు కోవాలంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.