పీవీ జీవితం చిరస్మరణీయం
ఆయన కుటుంబంతో ప్రధాని
హైదరాబాద్ – ఏది ఏమైనా ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి. ఆయన ఇతరులను గౌరవించడంలో తనకు తానే సాటి. ప్రత్యేకించి ఆతిథ్యం ఇవ్వడంలోనూ, ఇతరులతో సత్ సంబంధాలను మెరుగు పర్చడంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తారు.
తాజాగా ఇలాంటి అరుదైన సన్నివేశానికి వేదికైంది హైదరాబాద్ నగరం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇక్కడికి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన తన మనసులోని మాటను తెలియ పర్చారు పార్టీ పెద్దలకు.
విషయం ఏమిటంటే తమ పార్టీకి చెందిన వాడు కాక పోయినప్పటికీ ప్రధాని పట్టుబట్టి దేశంలోనే అత్యున్నతమైన గౌరవ పురస్కారంగా భావించే భారత రత్న బిరుదను దివంగత , తెలంగాణ ప్రాంతానికి చెందిన అపర చాణుక్యుడు పాములపర్తి నరసింహా రావు (పీవీ)కు ఇచ్చేలా చూశారు. ఇందులో మోదీ కృషి ఉంది.
ఈ సందర్బంగా పీవీ కుటుంబంతో ప్రధాని మోదీ కలుసుకున్నారు. తమ తండ్రికి భారత రత్న ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవిత కాలంలో అత్యంత ప్రభావితమైన నాయకులలో పీవీ ఒకరు అని కితాబు ఇచ్చారు మోదీ.