SPORTS

శాంస‌న్ పోరాటం త‌ప్ప‌ని ప‌రాజ‌యం

Share it with your family & friends

ఢిల్లీ దెబ్బ‌కు ఠారెత్తిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్

న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా న్యూ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ‌ను రేపింది. చివ‌ర‌కు ఢిల్లీ బ్యాట‌ర్లు, బౌల‌ర్ల ప్రతాపానికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల వంచింది. నాయ‌కుడంటే ఎలా ఉండాలో ఆచ‌ర‌ణ‌లో చూపించాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ . కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

ఇక ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. విచిత్రం ఏమిటంటే టాస్ గెలిచిన శాంస‌న్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దంచి కొట్టారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. పంత్ నిరాశ ప‌రిచినా చివ‌ర‌కు ఆ జ‌ట్టు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ర‌న్స్ చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి. ప్ర‌ధానంగా ఫ్రేజ‌ర్ , పొరెల్ , స్ట‌బ్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడారు. ఆ జ‌ట్టుకు భారీ స్కోర్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్థానానికి చేరుకుంది.

ఢిల్లీ జ‌ట్టులో అభిషేక్ పొరెల్ 36 బంతులు ఎదుర్కొని 65 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. జేక్ ఫ్రేస‌ర్ 20 బంతుల‌లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్స‌ర్లు బాదాడు. స్ట‌బ్స్ 20 బాల్స్ ఎదుర్కొని 41 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ,3 సిక్స‌ర్లు ఉన్నాయి.

అనంత‌రం బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ ఆదిలోనే జైశ్వాల్ వికెట్ ను పారేసుకుంది. మైదానంలోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 46 బంతులు ఎదుర్కొని 86 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. రియాన్ ప‌రాగ్ ఒక్క‌డే రాణించాడు. మిగ‌తా వారు ఎవ‌రూ ఆశించిన మేర స‌త్తా చాట‌లేక పోయారు.